Karthika Deepam2 : పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వచ్చిన గౌతమ్.. జ్యోత్స్న టెన్షన్!
on Jun 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -375 లో....కిచెన్ లో దీప వంట చేస్తుంది. ఏం చేస్తున్నావ్ మరదలా అంటూ కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తారు. రేపు నువ్వే అసలైన వారసురాలివి అని తెలిసాక కూడా ఇలాగే పనులు చేస్తావా అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు కూడా ఇలాగే చేస్తాను అందరికి వచ్చిన వంటలు చేసి కడుపు నిండా భోజనం పెడతాను. అప్పుడు నాకు చాల సంతోషంగా ఉంటుందని దీప అనగానే అబ్బో సుమిత్ర అమ్మ కూతురు బానే మాట్లాడుతుందని కార్తీక్ అంటాడు. గట్టిగా అనకండి ఎవరైనా వింటారని దీప అంటుంది.
ఎవరు విన్నా పర్వాలేదు కానీ ఆ బ్రహ్మ రాక్షసి జ్యోత్స్న వినకూడదని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఏంటి ఏదో వినకూడదు అంటున్నారని అడుగుతుంది. ఏం లేదు అంటూ దీప టాపిక్ డైవర్ట్ చేస్తుంది. కాసేపు కార్తీక్ తన వెటకారం మాటలతో జ్యోత్స్నని ఆడుకుంటాడు. నాకు ఒక గంట పర్మిషన్ కావాలి ఓనర్ గారు అని కార్తీక్ అంటాడు. ఎందుకని జ్యోత్స్న అడుగుతుంది. నా పాత ఫ్రెండ్ ని కలవాలని కార్తీక్ చెప్తాడు. త్వరగా రండీ అని దీప అంటుంది. ఒకే మిస్ యూ అని దీపతో కార్తీక్ చెప్తుంటే.. మీ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత గౌతమ్ ని కలిసి మాట్లాడుతాడు కార్తీక్. నీకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టం కదా.. నువ్వు ఇప్పుడే వచ్చి పెళ్లి గురించి మాట్లాడు.. ఇలా నీకు హెల్ప్ చేస్తున్నానని ఇంట్లో ఎవరికి చెప్పకని గౌతమ్ తో కార్తీక్ అంటాడు.
సరే నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి మాట్లాడతానని గౌతమ్ అంటాడు. సరే తమ్ముడు అని కార్తీక్ అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న కలిసి దీప, కార్తీక్ ఇద్దరు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారని ఆలోచిస్తారు. అప్పుడే గౌతమ్ వచ్చి శివన్నారాయణతో మాట్లాడతాడు. అసలు గౌతమ్ ఎందుకు వచ్చాడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నేను పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చానని గౌతమ్ చెప్తాడు. నువ్వు వెళ్లి దీపని కాఫీ తీసుకొని రమ్మని చెప్పు.. అప్పుడు గౌతమ్ ని దీప చూస్తే మళ్ళీ గొడవ అవుతుందని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



